Advocate Muppalla on CID Arguments చంద్రబాబు తరపు న్యాయవాదుల ప్రశ్నలకు సీఐడీ సమాధానాలు చెప్పలేకపోతోంది.. బాబు జైలులోనే ఉంచేలా వ్యవహరిస్తోంది: ముప్పాళ్ల
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 19, 2023, 10:00 PM IST
Advocate Muppalla on CID Arguments స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విచారణలో భాగంగా.. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు.. హైకోర్టులో వింత వాదనలు వినిపించారని.. సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు అడిగిన ప్రశ్నలకు.. సీఐడీ తరఫు న్యాయవాదులు సమాధానాలు చెప్పడంలో విఫలమయ్యారన్నారు. ఈ కేసును హైకోర్టు కొట్టివేసినా.. చంద్రబాబును సుదీర్ఘ కాలం జైలులోనే ఉంచేలా ప్రభుత్వం, సీఐడీ పావులు కదుపుతున్నాయని తెలిపారు.
సీఐడీ తరఫు న్యాయవాదులు వాస్తవాలను చెప్పడంలేదని పేర్కొన్నారు. తాజాగా చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేయడం చూస్తుంటే.. ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అందరికీ అర్థమవుతోందని అన్నారు. ఇంకా కేవలం ఇవే కాకుండా మరిన్ని కేసులు వేయాలనుకుంటున్నారని.. తద్వారా చంద్రబాబును జైలులోనే ఉంచాలని ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. చంద్రబాబు జైలులో ఉంటే ఆనందం వ్యక్తం చేయాలనే దురాలోచనతో సీఐడీ అధికారులు, ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. ఇలా మరిన్ని విషయాలను పంచుకున్న ముప్పాళ్ల సుబ్బారావుతో ముఖాముఖి.