ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP MLA SAI PRASAD REDDY COMMENTS ON CM JAGAN

ETV Bharat / videos

నాలుగేళ్ల కదా..! జగన్ మళ్లీ గెలిస్తే, మంచి అనుభవం వస్తుంది.. మంచి పాలన వస్తుంది..! - sensational comments on cm jagan

By

Published : Apr 8, 2023, 10:42 AM IST

YCP MLA SAI PRASAD REDDY COMMENTS ON CM JAGAN : జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో సీఎం జగన్​పై ఆదోని వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్​రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్​కు అనుభవం తక్కువ ఉందని.. మరో ఐదు సంవత్సరాలు పూర్తైతే మరింత అనుభవం వస్తుందని అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్​లో శుక్రవారం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 30ఇళ్లకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మళ్లీ గెలిస్తే జగన్​కు అనుభవం వస్తుందని.. అనుభవం ఉంటే మెరుగైన పాలన అందించేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిన్నటి నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాల గురించి.. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇళ్లకు స్టిక్కర్లు అతికిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details