Actor Srikanth In Wangara: వంగరలో నటుడు శ్రీకాంత్ సందడి..
విజయనగరం జిల్లా వంగర మండల కేంద్రంలో శిరిడి సాయి బాబా ఆలయ ప్రథమ వార్షికోత్సవానికి సినీ నటుడు శ్రీకాంత్ హాజరయ్యారు. ఆయనతో పాటు కమెడియన్ రాజబాబు తమ్ముడు చిట్టి బాబు, శ్రీలక్ష్మి, రాగిని, జబర్దస్త్ సుధాకర్ ఇతర నటీనటులు వచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. హీరో శ్రీకాంత్ రావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తులు ఆయనను చూసేందుకు ఆసక్తి చూపారు. శ్రీకాంత్ శిరిడి సాయిబాబాను దర్శించుకొని పూజా కార్యక్రమాల్లో పొల్గొన్నారు. అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ సాయిబాబాను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికను పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. షూటింగ్ వాయిదా పడటం వల్ల ఇక్కడికి వచ్చి సాయిబాబాను దర్శించుకునే భాగ్యం కలిగిందని తెలిపారు. అనంతరం ఆలయం కమిటీ సభ్యులు శ్రీకాంత్‌ను ఘనంగా సన్మానించారు. కమెడియన్ రాజబాబు తమ్ముడు చిట్టి బాబు, శ్రీలక్ష్మి, రాగిని, సుధాకర్ నటీనటులు పలు కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. శ్రీకాంత్‌ను చూసేందుకు అభిమానులు పొటీపడ్డారు.