ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు ప్రభుదేవా - అభిమానుల తాకిడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2024, 5:13 PM IST

Actor_Prabhu_Deva_Tirumala_Visit

Actor Prabhu Deva Tirumala Visit: తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు, దర్శకుడు, డ్యాన్స్​ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా (Prabhudeva) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ప్రభుదేవాకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం బయటకు వచ్చిన ప్రభుదేవాతో ఫొటోలు తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. 

ప్రభుదేవా తమిళ కథానాయకుడు విజయ్‌ నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, స్నేహ, లైలా, ప్రశాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details