ఆంధ్రప్రదేశ్

andhra pradesh

nara brothers

ETV Bharat / videos

ప్రస్తుత పరిస్థితుల్లో.. వైసీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి : నారా రోహిత్​ - 50th day of yuvagalm

By

Published : Mar 25, 2023, 7:56 PM IST

Nara Rohit in Yuvagalam Padayatra : రానున్న శాసనసభ సాధారణ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పటం హస్యాస్పదంగా ఉందని నటుడు నారా రోహిత్​ అన్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ సోదరుడు నారా రోహిత్​ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేశ్​ చేపట్టిన యువగళం పాదయాత్ర 50 రోజుకు చేరుకున్న సందర్భంగా నారా రోహిత్​ పాదయాత్రలో పాల్గొని అభినందనలు తెలిపారు. సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో కొనసాగిన పాదయాత్రలో నారా రోహిత్​ పాల్గొనటంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది.  

ప్రజలలో యువగళం పాదయాత్రకు పెరుగుతున్న ఆదరణ చాలా సంతోషకరమని నారా రోహిత్​ అన్నారు. మార్పు మొదలైందని.. ఇటీవల వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతోనే తెలుస్తుందన్నారు. చంద్రబాబు పాలనకు, అధికార వైసీపీ పాలనకు మధ్య వ్యత్యాసం ప్రజలకు తెలిసిందని వివరించారు. వైసీపీ అంటున్న వైనాట్​ 175 అంటే వారికే తెలియాలని.. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావటం, ఎమ్మెల్యేలలో అసంతృప్తి వ్యక్తమవుతున్న తరుణంలో వైసీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని పేర్కొన్నారు.  

ABOUT THE AUTHOR

...view details