ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Achenaidu Complained to EC in YCP Misuse Voters Data

ETV Bharat / videos

ఓటర్ల వ్యక్తిగత డేటా దుర్వినియోగం - ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు - ఈసీకి ఫిర్యాదు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 10, 2024, 7:18 PM IST

Achenaidu Complained to EC in YCP Misuse Voters Data:ఎన్నికల డేటా బేస్ చట్టవిరుద్ధంగా వైసీపీ నేతలకు చేరుతున్న వైనంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎలక్షన్ కమిషన్​కు ఫిర్యాదు చేశారు. మంత్రి విడదల రజని పేరు మీద గుంటూరు, పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల ఫోన్ నెంబర్లకు మెసేజ్​లు పంపించారని అచ్చెన్నాయుడు ఫిర్యాదులో వెల్లడించారు. ఓటర్ల వ్యక్తి గత సమాచారాన్ని అధికార పార్టీ దుర్వినియోగం చేయడం పట్ల అచ్చెన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు ఎలక్షన్ కమిషన్​ను కోరారు.

రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉందని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజల వ్యక్తిగత వివరాలు అధికార పార్టీ నేతల వద్ద ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మరో వంద రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తరిమివేయడం ఖాయమని పేర్కొన్నారు. జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ "రా కదలి రా" పేరిట కార్యక్రమాలు చేపడుతోందని ఆయన అన్నారు. వైసీపీ నేతలు ఓటర్ల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేయటంపై ఆయన మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details