ఆంధ్రప్రదేశ్

andhra pradesh

achchennaidu_on_kolikapudi

ETV Bharat / videos

జగన్ రెడ్డి అవినీతి, అరాచకాన్ని ప్రశ్నించడమే నేరమా: అచ్చెన్న

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2023, 7:13 PM IST

Achchennaidu on CID Harassment of Kolikapudi: ప్రజాసమస్యలపై స్పందిస్తున్న దళిత ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావుని సీఐడీ (AP CID) నోటీసులతో వేధింపులకు గురి చేయడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. హైదరాబాద్​లోని కొలికపూడి నివాసానికి వెళ్లి తన కుటుంబ సభ్యులను సీఐడీ భయబ్రాంతులకు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 ఏళ్ల పాపకు నోటీసులు ఇస్తామని బెదిరించడం అమానవీయమనని ధ్వజమెత్తారు. నియంతలు పాలిస్తున్న దేశాల్లో కూడా ఇంతటి క్రూరత్వం లేదని మండిపడ్డారు. కొలికపూడి నివాసానికి విజిటర్స్​గా వచ్చిన సీఐడీ అధికారుల తీరు సరిగా లేదని విమర్శించారు. కొలికపూడి చేసిన తప్పేంటని ప్రశ్నించారు. ప్రజాసమస్యలు, జగన్ రెడ్డి అవినీతి, అరాచకాన్ని ప్రశ్నించడమే నేరమా అని నిలదీశారు. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రశ్నించేవారిని చూసి జగన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. అరాచక పాలనకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉందని అన్నారు. మరో వంద రోజుల్లో జగన్ రెడ్డిని ప్రజలు తరిమివేయడం ఖాయమని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details