ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Accident_ Victims_ Protest_ At_ Hospital

ETV Bharat / videos

Accident Victims Protest At Hospital : మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కదిరి ప్రభుత్వాసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన.. - కదిరి న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 1:54 PM IST

Accident Victims Protest At Hospital: శ్రీ సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని  బాధిత కుటుంబాలు.. కదిరి ప్రభుత్వాస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి వద్ద కారు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పరామర్శించారు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న వారు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమని మాజీ మంత్రి అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మృతుల బంధువులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మృతదేహాలతో ఆందోళన చేపట్టారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పై చర్యలు తీసుకుని మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు సర్ది చెప్పి.. ఆందోళన విరమింప చేశారు. ఎర్రదొడ్డి వద్ద కారు, ఆటోను ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details