ఆంధ్రప్రదేశ్

andhra pradesh

acb

ETV Bharat / videos

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ దర్శి ఎస్ఐ రామకృష్ణ - bribe prakasam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2024, 9:10 PM IST

ACB Officials Caught the SI Taking Bribe : ఛార్జ్​షీట్​ నమోదు చేయడానికి రూ.20 వేలు లంచం తీసుకుంటున్న ఎస్​ఐను ఏసీబీ అధికారులు పట్టుబడిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. దర్శి పట్టణానికి చెందిన శేషం పెద్ద రమణయ్య, చిన్న రమణయ్య ఇద్దరు అన్నదమ్ములు. వీరు వృత్తిరీత్యా లాయర్లు. 2022వ సంవత్సరంలో ఒక హత్య కేసులో నిందితులుగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని సవాల్​ చేస్తూ హైకోర్ట్​లో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ కేసును విచారించాలని జిల్లా ఎస్పీ, డీఎస్పీ, దర్శి ఎస్ఐలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పెద్ద రమణయ్య, చిన్న రమణయ్య కేసును విచారణ చేపట్టిన ఎస్ఐ రామకృష్ణ వారికి అనుకూలంగా ఛార్జ్​షీట్ రాయలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని అడిగారు. దీంతో పెద్ద రమణయ్య సోమవారం (జనవరి 1న) ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు దర్శి పోలీసు స్టేషన్​లో లంచం ఇవ్వడానికి పెద్ద రమణయ్య ఒప్పుకున్నారు. పథకం ప్రకారం ఎస్​ఐ రామకృష్ణకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్​ఐను అదుపులోకి తీసుకొని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details