ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ACB_Filed_Case_on_SI_and_CI

ETV Bharat / videos

కులాంతర ప్రేమ పెళ్లి వ్యవహారం - లంచం అడిగిన సీఐ, ఎస్​ఐపై ఏసీబీ కేసు - andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 7:13 PM IST

ACB Filed Case on SI and CI: శ్రీ సత్య సాయి జిల్లాలో రామగిరి సీఐ చిన్నగౌస్, కనగానపల్లి ఎస్సై హనుమంత రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు. చెన్నే కొత్తపల్లి పోలీస్ స్టేషన్​పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కులాంతర ప్రేమ వివాహం వివాదంలో లంచం డిమాండ్ చేసిన అంశంలో ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్​పై దాడులు నిర్వహించారు. 

ఈ దాడుల్లో ఎస్సై హనుమంత్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. సీఐ చిన్న గౌస్ అక్కడి నుంచి పరారయ్యారు. విచారణ నిమిత్తం లంచం డిమాండ్ చేసిన ఆరోపణ రుజువు కావడంతో ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు. హనుమంతరెడ్డిని కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరిచనున్నట్లు తెలిపారు. సీఐ చిన్న గౌసు పరారీలో ఉన్నారని, ఆయన కోసం గాలిస్తున్నామని డీఎస్పీ చెప్పారు. ఏ అధికారైన లంచం డిమాండ్ చేస్తే ప్రజలు 14400 ఏసీబీ నెంబర్​కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని డీఎస్పీ కోరారు.

ABOUT THE AUTHOR

...view details