AIIMS first ranker interview : ఒక్కటే సీటు కదా అని వదల్లేదు..! కర్నూలు యువ వైద్యుడికి ఎయిమ్స్ ఫస్ట్ ర్యాంక్ - గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్
Topper in AIIMS entrance exams : ఆల్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-ఎయిమ్స్ ప్రవేశ పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించటం అంత ఆశామాషీ కాదు. కానీ, కర్నూలుకు చెందిన యువ వైద్యుడు డా. పెరుగు ప్రణీత్‌రెడ్డి జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబర్చి ప్రథమ ర్యాంకు సాధించి ఔరా అనిపించాడు. ఎంచుకున్న లక్ష్య సాధన కోసం అహర్నిశలు శ్రమించాడు. అత్యుత్తమ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. కర్నూలుకు చెందిన డా.పెరుగు ప్రణీత్‌రెడ్డి సూపర్ స్పెషాలిటీ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకోవడం ద్వారా చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో కిడ్నీ మార్పిడికి సంబంధించిన విభాగంలో సీటు సాధించాడు. ప్రణీత్ రెడ్డి ఎంచుకున్న విభాగంలో ఒకే ఒక్క సీటు ఉండగా.. ఫస్ట్ ర్యాంకుతో దక్కించుకోవడం విశేషం. ప్రణీత్‌రెడ్డి 2019లోనే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 2022లో కర్నూలు వైద్య కళాశాలలో జనరల్ సర్జరీ విభాగంలో పీజీ పూర్తి చేశారు. ఫస్ట్ ర్యాంకు దక్కించుకున్న నేపథ్యంలో ఎయిమ్స్ ప్రవేశ పరీక్షకు ఎలా ప్రిపేర్ అయ్యారు.? ప్రథమ ర్యాంకు సాధించడానికి ఏఏ అంశాలు దోహదపడ్డాయి..? తదితర అంశాలను యువవైద్యుడు డా. ప్రణీత్‌రెడ్డిని అడిగి తెలుసుకుందాం.