ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Woman_Locked_the_Pendurthi_Police_Station

ETV Bharat / videos

A Woman Locked to Pendurthi Police Station: పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు తాళం వేసిన మహిళ.. వీడియో వైరల్ - Pendurthi Police Station updates

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2023, 10:51 PM IST

A Woman Locked to Pendurthi Police Station: గత ఐదు రోజులుగా న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా.. తనకు పోలీసులు న్యాయం చేయటం లేదంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు తాళం వేసిన సంఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో సంచలనంగా మారింది. అపార్ట్‌మెంట్ వద్ద వచ్చిన ఓ సమస్యను పరిష్కరించాలంటూ పోలీసులను వేడుకుంటున్నప్పటికీ.. తనను పట్టించుకోవటం లేదని బాధిత మహిళ కన్నీటిపర్యంతమయ్యింది.

అసలు ఏం జరిగిందంటే..విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు ఓ మహిళ తాళం వేసింది. అపార్ట్‌మెంట్ వద్ద వచ్చిన ఓ సమస్య గురించి ఆమె ఐదు రోజులుగా పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో పోలీసులు తన సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, తనకు న్యాయం చేయటం లేదంటూ పోలీస్ స్టేషన్‌కు తాళం వేసింది. దీంతో పోలీసులు, మహిళలు అడ్డుకొని స్టేషన్‌కు తాళం తీయించారు. అనంతరం పోలీసులు న్యాయం చేయకపోతే పెందుర్తి పోలీస్ స్టేషన్‌ ముందు దీక్షకు దిగుతానని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

ABOUT THE AUTHOR

...view details