ఫిర్యాదును పట్టించుకోలేదని యువకుడు హల్చల్ - కిరోసిన్ డబ్బాతో కలెక్టర్ కార్యాలయంపైకి - ప్రకాశం జిల్లా యువకుడి ఆత్మహత్య కథనం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 3:17 PM IST
A Man Committed Suicide by Climbing Up the Collector's Office : తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓయువకుడు ప్రకాశం జిల్లా కలెక్టరు కార్యాలయం పైకెక్కి హల్చల్ చేశాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లా చినగంజాంకు చెందిన మార్క్ బెన్నీ.. భూముల విషయంలో ఓ నాయకుడు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణం వల్ల తన సోదరి హత్యకు గురైందని తెలియజేశారు.
ఈ విషయంలో పరిహారం రావాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు, పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేదని ఆరోపించారు. ఈ కారణంతో మనస్థాపానికి గురై తను.. కిరోసిన్ బాటిల్తో కలెక్టరు కార్యాలయం పైకి.. ఆత్మహత్య చేసుకుంటానని అక్కడ ఉన్న వారికి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కొంతమంది యువకుల సహకారంతో పోలీసులు.. అతడిని చాకచాక్యంతో కిందకు దించారు. అనంతరం బెన్నీని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.