Fires in Forest: సోమశిల జలాశయం పైభాగాన ఏర్పడిన కార్చిచ్చు.. - సోమశిల జలాశయం లేటెస్ట్ న్యూస్
Fires Broke Out in The Hills: నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం పైభాగాన అటవీ ప్రాంతంలో మంగళవారం కార్చిచ్చు ఏర్పడి భారీగా మంటలు చెలరేగాయి. సోమశిల ఎగువ ప్రాంతాన వెలుగొండ అటవీ ప్రాంతం వద్ద ఈ ఘటన జరిగింది. సాయంత్రానికి కొండపై మంటలు ఉద్ధృతమయ్యాయి. ఆ ప్రాంతంలో ఇంతకుముందు నాలుగు సార్లు మంటలు ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం అక్కడ మంటలు చెలరేగటం ఐదోసారి. దీంతో అడవుల్లోని చెట్లు, వన్యప్రాణులకు ముప్పు ఏర్పడింది. తరచుగా అడవులు తగల పడుతుండటం వల్ల అడవిలోని జంతువులు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇది అటవీ ప్రాంతంలో పశువులు మేపుకోవడానికి వెళ్ళిన ఆకతాయిలు చేసిన పనిలా ఉందని అటవీ శాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ఆత్మకూరు రేంజర్ రామకొండారెడ్డి మాట్లాడుతూ.. మంటలను సిబ్బంది అదుపు చేస్తున్నట్లు తెలిపారు. కడప జిల్లా మల్లెంకొండ వైపు నుంచి ఈ మంటలు వ్యాపించాయని ఆయన అన్నారు. మరోవైపు ఏలూరు జిల్లాలోని దెందులూరు మండలం దోసపాడులో ఓ ఇంటి ముందు నిలిపి ఉంచిన కారుకు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు.