ఆంధ్రప్రదేశ్

andhra pradesh

road_accident_satyasai_district

ETV Bharat / videos

ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో గుడిసెలోకి దూసుకెళ్లిన కారు - ఒకరు మృతి, పలువురికి తీవ్రగాయాలు - ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో రోడ్డు ప్రమాదం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 5:32 PM IST

A Car Rammed into a Hut in Satya Sai District : శ్రీ సత్యసాయి జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. అగళి మండల సరిహద్దున కర్ణాటకలోని కెంతరళ హట్టి గ్రామంలో.. శుక్ర వారం అర్ధరాత్రి (నవంబరు 24) జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు పూరి గుడిసె లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మురళి (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గుడిసెలో నిద్రిస్తున్న.. మురళి తల్లిదండ్రులు, అన్న శ్రీరంగతో పాటు కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు .. వారిని కర్ణాటక లోని సిరా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతుడి తండ్రి, అన్న పరిస్థితి విషమించటంతో.. సిరా నుంచి తుమకూరు ఆసుపత్రికి తరలించారు. 

మధ్యలో  ఆగిపోయిన రహదారి పనులు పూర్తి చేసి.. ఇలాంటి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం బారిన పడిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. 

ABOUT THE AUTHOR

...view details