ఆంధ్రప్రదేశ్

andhra pradesh

7People_Injured_in_Bus_Accident_on_National_Highway

ETV Bharat / videos

డ్రైవర్ నిర్లక్ష్యంతో జాతీయ రహదారిపై ప్రమాదం ఏడుగురికి గాయాలు - palnadu bus accident on national highway

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 1:56 PM IST

7 People Injured in Bus Accident on National Highway: జాతీయ రహదారి(National Highway)పై  ఆర్టీసీ బస్సు బోల్తా పడి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఏడుగురిని హైవే పెట్రోలింగ్ వాహనంలో హుటాహుటిన చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన బొప్పూడిలో చోటుచేసుకుంది.

RTC Indra Bus Going from Vijayawada to Tirupati Accident in Palnadu: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి 16వ నంబర్ జాతీయ రహదారిపై బస్సు అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సు ఈ రోజు ఉదయం ప్రమాదానికి గురయింది. ప్రయాణికులుకు స్పల్ప గాయాలు అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  క్షతగాత్రులు విజయవాడ, ఒంగోలు వాసులుగా గుర్తించారు. గాయపడ్డ వారిని హైవే పెట్రోలింగ్ వాహనంలో హుటాహుటిన చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు.పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రామీణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు

Chilakaloori Peta Mandal Boppudu NH16 Bus Accident: గాయపడిన వారిలో విజయవాడకు చెందిన బండి ఆంజనేయులు, కందాలం భవాని, కందాలం వైష్ణవి, ద్రోణాదుల లక్ష్మీ కామేశ్వరి.. ఒంగోలుకు చెందిన ఈవూరి మాధవి, ఆబోతు సాయి పల్లవి, శ్రీరాములు ఏసోబు లు ఉన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details