ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

ETV Bharat / videos

Student Suspicious Death అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి.. పాఠశాల వద్ద ఉద్రిక్తత - ఆరో తరగతి విద్యార్థి మృతి

By

Published : Jul 1, 2023, 4:58 PM IST

Updated : Jul 1, 2023, 8:22 PM IST

Student Suspicious Death: వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం కొత్తపేటలో విషాదం చోటుచేసుకుంది. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ఆందోళనకు దిగారు. పాఠశాల సిబ్బంది కొట్టడంతోనే తమ బిడ్డ మృతి చెందారని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంపై కమిలిన గాయాలు ఉండడంతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పులివెందులకు చెందిన సోహెల్.. బీరం శ్రీధర్ రెడ్డి ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలోని వసతి గృహంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నాడు. కడుపు నొప్పిగా ఉందంటూ.. సోహెల్‌ తల్లిదండ్రులకు ఫోన్‌లో తెలపగా.. వారు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో మృతిచెందాడు. అయితే.. సోహెల్‌ ఒంటిపై గాయాలున్నాయని, పాఠశాల నిర్వాహకులు కొట్టడం వల్లే చనిపోయాడంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థి మృతదేహాంతో పాఠశాల ఎదుట బైఠాయించారు. వీరికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలపడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వసతి గృహంలోని సీసీ ఫుటేజ్‌లు బయటపెట్టాలని సోహెల్‌ బంధువులు డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యం కనీసం స్పందించడం లేదంటూ.. కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న.. విద్యార్థి బంధువులపై లాఠీఛార్జీ చేశారు. ఒక పోలీస్ అధికారి ఇష్టం వచ్చినట్లు.. నెట్టిపడేశారు. వృద్ధులని కూడా చూడకుండా తోసేశారు. ఈడ్చిపారేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Last Updated : Jul 1, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details