ఆంధ్రప్రదేశ్

andhra pradesh

50 crore land grabbing allegations on ycp leaders

ETV Bharat / videos

'వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల భూ కబ్జా' - కోర్టుకు వెళ్లాక అదృశ్యమైన బాధితుడు : సోదరుడి ఫిర్యాదుతో వెలుగులోకి - ఏపీలో వైసీపీ భూ దోపిడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 7:32 PM IST

50 crore land grabbing allegations on ycp leaders: అక్కడ భూమి కోట్లు విలువ చేస్తుంది. ఆ భూమిపై అధికార వైసీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరుల కన్ను పడింది. ఇంకేముంది రాత్రికి రాత్రే... చకచకా నకిలీ అగ్రిమెంట్  పత్రాలు తయారయ్యాయి. ఒక్కటి  కాదు రెండు కాదు ఏకంగా... 50 కోట్ల విలువ చేసే... 18 ఎకరాల 30 సెంట్ల భూమిని కాజేసేందుకు నేతలు పన్నాగంపన్నారు. దీనిపై కోర్టుకు వెళ్లాడు. అయినా న్యాయం జరగలేదు. కబ్జాదారులు అక్కడ ఫోర్జరీ పత్రాలు సృష్టించారు. ఆ తరువాత నుంచి బాధితుడు గ్రామంలో కనిపించకుండా పోయాడు. తన అన్నకు జరిగిన మోసంపై బాధితుడి సోదరుడు చంద్రశేఖరరావు... శ్రీ సత్య సాయి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కరణం చంద్రశేఖరరావు తెలిపిన వివరాల ప్రకారం...  కరణం గోపాలరావుకు ఎనిమిది మంది కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గోపాలరావు ఆస్తిని కుమారులందరికీ సమానంగా పంచారు. వారిలో ఒక్కడైన కరణం రామకృష్ణకు చెందిన 18 ఎకరాల 30 సెంట్ల భూమి వచ్చింది. అయితే, కొందరు వైసీపీ నేతలు కరణం రామకృష్ణ సంతకాలు ఫోర్జరీ చేశారు. రామకృష్ణ కుమారుడు కరణం నాగతేజ సంతకాలు లేకుండా నకిలీ అగ్రిమెంట్ పత్రాలను సృష్టించారు. ఆ పత్రాలతో కోర్టును సైతం మోసగించి రామకృష్ణ ఆస్తిని కాజేసేందుకు కుట్రలు పన్నారు. గత కొద్ది రోజులుగా రామకృష్ణ కుటుంబం కనిపించడం లేదు... బతికి ఉన్నాడా లేదా అనే విషయం తెలియడం లేదని గోపాలరావు ఆరోపించాడు. తమ అన్న రామకృష్ణను వెతికి పెట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్లు చంద్రశేఖరరావు తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details