కంటైనర్ రహస్య అరల్లో 492 కిలోల గంజాయి - దిల్లీ కేంద్రంగా సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 2:35 PM IST
492 KG Ganja Seized in Sri Satya Sai District :కంటైనర్‌లోని రహస్య అరల్లో దాచి బెంగళూరుకు గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను రెండు రోజుల క్రితం పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా శ్రీ సత్యసాయి ఎస్పీ మాధవరెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. జిల్లాలోని చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద ముందస్తు సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేపట్టామని తెలిపారు.
Sri Satya Sai District SP Madhava Reddy Press Meet on 492 KG Cannabis Seized Case :వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో హైదరాబాద్ వైపు నుంచి బెంగళూరుకు వెళ్తున్న కంటైనర్ డ్రైవర్లు పోలీసులను గమనించి, పారిపోయేందుకు ప్రయత్నం చేశారని, అప్రమత్తమై వెంటపడి వారిని అదుపులోకి తీసుకున్నామని మాధవరెడ్డి తెలిపారు. అనంతరం కంటైనర్ ముందు భాగంలో ఉన్న రహస్య అరల్లో 246 ప్యాకెట్లలో దాచిన 492 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి విలువ సుమారు కోటి రుపాయల దాకా ఉంటుందని, దిల్లీ కేంద్రంగా ఈ ముఠా సభ్యులు గంజాయి సరఫరా చేస్తున్నారని పెర్కొన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత సంబంధిత వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.
Police Seize 492 KG Cannabis in AP :కంటైనర్ డ్రైవర్లు బిహార్‌కు చెందిన మృత్యుంజయ పాటిల్, యూపీకి చెందిన మహమ్మద్ ఆపాక్‌లతో పాటు గంజాయి రవాణాలో భాగస్వాములైన మరో వాహన డ్రైవర్లు యూపీకి చెందిన గులాం జిలాని, మహమ్మద్ మోసిన్‌లను అరెస్టు చేసినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.