320 KG Ganja Seized in Mentada విజయనగరంలో భారీగా గంజాయి స్వాధీనం..రెండు వాహనాలు సీజ్ - 320 గంజాయి స్వాధీనం రెండు వాహనాలు సీజ్
320 KG Ganja Seized in Mentada : రాష్ట్రంలో గంజాయి ఆనవాళ్లను రూపుమాపామని అధికార పార్టీ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు చేబుతున్నారు. కానీ వాస్తవాలు వారి మాటలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రతి రోజు ఎక్కడో చోట గంజాయి వాసన వస్తూనే ఉంది. తాజాగా విజయనగరం జిల్లాలో గంజాయి గుట్టు రట్టయ్యింది.
అక్రమంగా తరలిస్తోన్న 320 కేజీల గాంజాయిని విజయనగరం జిల్లా గజపతినగరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొబ్బిలి డీఎస్పీ శ్రీధర్ గజపతినగరం సర్కిల్ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. తమకు వచ్చిన ముందస్తు సమాచారంతో ఆదివారం ఉదయం మెంటాడ మండలం లోతుగెడ్డ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఆ సమయంలో అశోక్ లే ల్యాండ్ వాహనంలో తరలిస్తోన్న 32 ప్యాకెట్లలో ఉన్న దాదాపు 320 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటాడి పట్టుకున్నమన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. రెండు వాహనాలను, ఏడు వేల రూపాయలను కూడా సీజ్ చేశామని తెలిపారు. అశోక్ లే ల్యాండ్ వాహనం డ్రైవర్ ఒడిశా రాష్ట్రం.. కొరాపుట్కి చెందిన బాగ్ బాన్ (33)గా గుర్తించారు. గంజాయిని ఒడిశా నుంచి విజయనగరం తరలిస్తున్నారని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.