2000 Notes Exchanged: ప్రారంభమైన నోట్ల మార్పిడి ప్రక్రియ.. బ్యాంకుల వద్ద కనిపించని రద్దీ - ప్రారంభమైన నోట్ల మార్పిడి ప్రక్రియ
Two Thousand Rupees Exchange Started From Today: రూ.2000 నోట్లను ఉపసంహరించుకోవాలని ఈనెల 19న రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. సర్క్యులేషన్లో ఉన్న వాటన్నింటినీ వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నోట్లు మార్చుకునేందుకు మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా నేటి నుంచి రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా నోట్ల మార్పిడి కోసం జాతీయ, ప్రైవేటు బ్యాంకులు అన్ని ఏర్పాట్లు చేశాయి. 2 వేల రూపాయల నోట్లు ఉన్నవారు సమీపంలోని బ్యాంకులకు వచ్చి వారి వివరాలను పొందుపరిచి మార్పిడి చేసుకుంటున్నారు. మొదటి రోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బ్యాంకుల వద్ద పెద్దగా రద్దీ కనిపించలేదు. కొద్ది మంది మాత్రమే నోట్లు మార్చుకునేందుకు బ్యాంకులకు వచ్చారు. మరోవైపు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్యాంకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని బ్యాంకుల వద్ద పరిస్థితి, ప్రజల స్పందనను మా ప్రతినిధి వెంకట రమణ అందిస్తారు.