ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆకర్షణగా 12 అడుగుల భారీ బతుకమ్మ - 12 feet Bathukamma latest news in Narsampet

By

Published : Oct 3, 2022, 6:08 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

Special Bathukamma తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నర్సంపేటలో తయారు చేసిన 12 అడుగుల బతుకమ్మ సద్దుల రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నర్సంపేటకు చెందిన రుద్రారపు పైడయ్య వృత్తిరీత్యా తాపీ మేస్త్రి. గత 18 సంవత్సరాల నుంచి మూడు ఫీట్ల బతుకమ్మతో ప్రారంభించి, నేడు 12 ఫీట్ల బతుకమ్మ వరకు రూపొందించారు. పెత్తర అమావాస్య మొదలుకొని తొమ్మిది రోజులపాటు తీరోక్క పూలను సేకరించి 15 మంది పనివారి సహాయంతో ఈ భారీ బతుకమ్మను తయారు చేస్తున్నట్లు పైడయ్య తెలిపారు. బతుకమ్మను తయారు చేయడం తనకు ఎంతో ఇష్టమని ఆ గౌరమ్మ దయతోనే ఇది సాధ్యమైందని.. తన కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నామని ఆయన తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details