12 feet Python: అల్లూరి జిల్లాలో 12 అడుగుల కొండచిలువ - 12 అడుగుల కొండచిలువ
12 feet Python in Mothugudem Guest House Surrondings: అల్లూరి జిల్లాలో కొండచిలువ హల్చల్ సృష్టించింది. దానిని చూసిన జెన్కో సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఓ జెన్కో ఉద్యోగి దానిని పట్టుకుని బంధించగా తోటి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఉద్యోగి దానిని బంధించగా అటవీ శాఖ అధికారులు దానిని స్వాధీనం చేసుకుని నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెట్టారు.
అసలేం జరిగిందంటే..అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు ప్రాజెక్టు మోతుగూడెం ఏపీ జెన్కో అతిథి గృహ అవరణలో సిబ్బందికి కొండ చిలువ కనిపించింది. 12 అడుగుల పొడవు ఉన్న ఈ కొండచిలువను చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో జెన్కోలో విధులు నిర్వహిస్తున్న చింతా రాంబాబు అనే ఉద్యోగి.. విషయం తెలుసుకుని.. అక్కడకు వచ్చారు. దానిని చాకచక్యంగా పట్టుకుని బంధించారు. దీంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా.. అటవీ శాఖ సిబ్బంది కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.