ఆంధ్రప్రదేశ్

andhra pradesh

joined_tdp_from_ycp

ETV Bharat / videos

100 Muslim Families Joined TDP from YCP: వైసీపీ నుంచి టీడీపీలోకి 100 కుటుంబాలు.. అక్కడ అభివృద్ధి లేదంటూ..! - AP Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 12:42 PM IST

Updated : Oct 7, 2023, 4:59 PM IST

100 Muslim Families Joined TDP from YCP:వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలు, దోచుకోవడం, దాచుకోవడమే తప్ప అభివృద్ధంటూ ఏమి జరగలేదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ బాషా సమక్షంలో స్థానిక వైసీపీ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి, కో ఆప్సన్ సభ్యుడు రెడ్డి కరీం, సుమారు 100 కుటుంబాలకు పైగా ముస్లింలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారిని పుత్తానరసింహారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. స్థానిక దర్గా వద్ద ఉన్న శుద్ధి నీటి ప్లాంటు నుంచి తాళిం వరకు పెద్ద ఎత్తున ముస్లిం నాయకులు పుత్తాను గజమాలను వేసి సత్కరించారు. చెప్పుడు మాటలు విని వైసీపీలో చేరానని అక్కడ అంతా మోసం అని, ఏమీ లేదని తెలుసుకుని టీడీపీలోకి వచ్చానని రెడ్డి కరీం అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మేనల్లుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడ్డుపెట్టుకొని కమలాపురం నియోజకవర్గాన్ని, కడప పట్టణాన్ని అందిన కాడికి దోచుకుంటుంన్నారని ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

Last Updated : Oct 7, 2023, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details