ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Girl Family Attacked A Young Man In AP

ETV Bharat / videos

ప్రేమిస్తున్నాడని యువకుడిని చితకబాదిన యువతి బంధువులు - వీడియో వైరల్ - దాడి వీడియోలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2023, 10:10 PM IST

Girl Family Attacked A Young Man in AP: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అమానుషం చోటు చేసుకుంది. కుమార్తెను ప్రేమిస్తున్న యువకుడిని అమ్మాయి బంధువులు దుస్తులు విప్పించి చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనపర్తికి చెందిన ఓ యువతిని నెల్లూరుకు చెందిన ఓ యువకుడు ప్రేమించాడు. అమ్మాయి బంధువులు ఆ యువకుడిని అనపర్తికి రప్పించారు. బట్టలు విప్పించి చితకబాదారు. వీడియో కూడా తీశారు. ఆ యువకుడు కొట్టకండని ఎంత ప్రాధేయపడినా కనికరించలేదు.

 ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సీఐ (CI) శివగణేషను వివరణ కోరగా సామాజిక మాధ్యమాల్లో  వచ్చిన వీడియో ఆధారంగా విచారణ చేపట్టామని తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని సీఐ తెలిపారు. ఘటనపై  స్థానిక వీఆర్​ఓ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.  పూర్తి స్థాయి విచారణ చేపట్టి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. వైరల్ వీడియో  (Viral video) తమ దృష్టికి వచ్చిందని, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని.. తెలిపారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details