ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Today Prathidwani on PRC: ఏపీలో మరోసారి పీఆర్సీ రగడ.. ఆ జీవోలపై భగ్గుమంటున్న ఉద్యోగులు - ఏపీలో పీఆర్సీ జీవోలు తగులబెడుతున్న ఉద్యోగులు

By

Published : Jan 18, 2022, 9:32 PM IST

Prathidwani on PRC: రాష్ట్రంలో మరోసారి పీఆర్సీ వేడి రగిలింది. దుర్మార్గం అంటూ ఒకరు.. ఇదేం వేతనసవరణ అంటూ మరొకరు.. ఉద్యోగ సంఘాలన్నీ భగ్గమంటున్నాయి. జీతభత్యాలు పెంచడం కాదు.. అడ్డంగా తెగ్గోశారని ఆక్రోశిస్తున్నారు ఉద్యోగులు. పెద్దలపైనా కనీస కనికరం చూపలేదని పెన్షనర్లు వాపోతున్నారు. ఇంటి అద్దె భత్యాలు కోసుకు పోయాయి. సీసీఏ అలవెన్సులు పూర్తిగా అదృశ్యం కానున్నాయి. మధ్యంతరభృతి ముచ్చటే లేదు.. ఇకపై పదేళ్లకోసారే వేతన కమిషన్ అంటూ వరస జీవోలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సంఘాల డిమాండ్ల బేఖాతరు చేస్తూ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఎంతవరకైనా పోరాడతాం... అవసరమైతే సమ్మెకు దిగుతాం అంటున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..

ABOUT THE AUTHOR

...view details