PRATIDWANI: దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి ఎంత..? దిగుమతులు ఎంత..? - amaravati news
వంటనూనెల స్వయం సమృద్ధి సాధనాలక్ష్యం దేశానికి ఆర్థిక భారం తగ్గించే ప్రత్యామ్నాయం. ఏటా లక్షల టన్నుల వంటనూనెల దిగుమతి కోసం వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం వెచ్చిస్తోంది కేంద్ర ప్రభుత్వం. స్థానికంగా సంప్రదాయ నూనె గింజల దిగుబడులు పెంచడంతో పాటు భారీ ఎత్తున ఆయిల్ పాం సాగును ప్రోత్సహించాలన్న విధానంతో ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇందుకోసం నూతన ఆయిల్ ఫాం మిషన్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశీయంగా మన వంట నూనెల వినియోగం ఎంత? స్థానికంగా జరుగుతున్న ఉత్పత్తి ఎంత? వంట నూనెల దిగుమతులు తగ్గించుకునే మార్గం ఏంటి? ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని.