ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Pratidhwani: అప్గానిస్థాన్​లో ప్రస్తుత పరిణామాలను భారత్‌ కోణంలో ఎలా చూడాలి.. ? - అప్గానిస్థాన్​లో ప్రస్తుత పరిణామాలు

By

Published : Aug 21, 2021, 9:22 PM IST

Updated : Aug 21, 2021, 10:54 PM IST

అప్గానిస్థాన్. ఇప్పుడు ప్రపంచం నెత్తిన అదో నిప్పుల కుంపటి. పిన్ను పీకి చేతిలో పట్టుకున్న గ్రెనేడ్..! రెండు దశాబ్దాలు ప్రశాంత జీవనం గడిపిన అప్ఘాన్‌వాసులు.. ఇప్పుడు తాలిబన్లు తిరిగి పట్టు బిగించడంతో.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. తుపాకీ బ్యారెల్ అంచున నిలిచిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, పౌర హక్కులు.. ఇప్పటికే అక్కడి భయానక చిత్రాన్ని కళ్లకు కడుతున్నాయి. ఈ పరిణామాలతో ప్రపంచం మొత్తం.. ఒక ఉత్కంఠభరిత వాతావరణమే నెలకొంది. భారతదేశానికి ఈ కలవరం మరికాస్త ఎక్కువగా ఉంది. కొద్ది రోజులుగా అప్గానిస్థాన్‌ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను భారత్‌ కోణంలో ఎలా చూడాలి? దేశ భద్రత, రక్షణ సవాళ్ల పరంగా దిల్లీ నాయకత్వం ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Aug 21, 2021, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details