PRATHIDWANI: సమాచార హక్కు చట్టం అమలులో అలసత్వం.. సాకులతో తిరస్కరణ - అమరావతి వార్తలు
సమాచార హక్కు సామాన్యుల ఆయుధం. గ్రామ పంచాయతీ నుంచి దేశ అత్యున్నత పార్లమెంట్ వరకు ప్రజా ప్రయోజనం లక్ష్యంగా ఈ సమాచార హక్కును అస్త్రంగా ప్రయోగించొచ్చు. పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వెలుగులోకి రాని సమచారాన్ని సహచట్టం ద్వారా రాబట్టొచ్చు. చట్టబద్దమైన ఈ హక్కు ద్వారా ఆర్టీఐ కార్యకర్తలు దేశంలో అనేక అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీఐ దరఖాస్తు దారులపై దాడులు, హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజల చేతిలో బలమైన అస్త్రంగా ఉన్న సహచట్టం అమలుకు ప్రతిబంధకంగా మారిన అంశాలేంటి? అడిగిన సమాచారం ఇవ్వకుండా మొండికేస్తున్న అధికారులపై సమాచార కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ప్రజాస్వామ్య పరిరక్షణలో సహచట్టం స్ఫూర్తి ఎంత? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.