RAINS: తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పొంగుతున్న వాగులు..ఇబ్బందుల్లో ప్రజలు - తూర్పుగోదావరిలో పొంగిపొర్లతున్న వాగులు
తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో పలుచోట్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవటంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరి పరిస్థితి మరింత దారుణంగా మారింది. 204 మీటర్ల సామర్ధ్యం కలిగిన భూపతిపాలెం జలాశయంలోకి.. పూర్తిస్థాయిలో నీటిమట్టం చేరడంతో.. మూడు గేట్లు ఎత్తి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సీతపల్లి వాగులోకి విడుదల చేశారు.
Last Updated : Sep 7, 2021, 9:22 PM IST