ఒంగోలు గిత్తల బల ప్రదర్శన - ఒంగోలు గిత్తల పోటీలు లేటెస్ట్ న్యూస్
వీఆర్ సిద్ధార్థ కళాశాలలో నిర్వహిస్తున్న.. ఒంగోలు జాతి వృషభరాజాల బలప్రదర్శన, ఆవుల అందాల పోటీలు ఘనంగా ముగిశాయి. కేడీసీసీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే పార్థసారథి హాజరయ్యారు. సీనియర్ గిత్తల పోటీల్లో.. పెమనలూరుకు చెందిన దేవబత్తుని సుబ్బారావు ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి.