కన్నుల పండువగా కోటి రుద్రాక్షల ఊరేగింపు - ఒంగోలులో కోటి రుద్రాక్షల ఊరేగింపు
మహాశివరాత్రి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ముందస్తు వేడుకలు ప్రారంభమయ్యాయి. సంతపేటలో వెలసిన షిర్డీ సాయిబాబా దేవాలయంలో శివరాత్రికి కోటి రుద్రాక్షలతో పందిరి నిర్మాణం చేపడుతున్నారు. నిర్మాణానికి ముందు భక్తుల దర్శనార్థం కోటి రుద్రాక్షలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టణంలో తిరువీధి మహోత్సవం నిర్వహించారు.