ఆశ్చర్యపరిచేలా.. అద్భుతం అనిపించేలా..! - navy day rehearsals in vizag beach news
నౌకా దళ దినోత్సవం కోసం విశాఖ సాగర తీరం సన్నద్ధమవుతోంది. ఆర్కే బీచ్ లో తూర్పు నౌకా దళం నేవీ డే సన్నాహక విన్యాసాలు చేస్తోంది. జెమినీ బొట్లలో పహారాలు, యుద్ధ నౌక నావికుల హడావుడి, విమానాలు, హెలికాఫ్టర్లు, గ్లైడర్ ల సందడి.. ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ సాయంత్రంతో పాటు.. డిసెంబర్ 2న పూర్తి స్థాయి డ్రెస్ రిహార్సల్స్ జరుగుతాయి. డిసెంబరు 4న నౌకా దళ దినోత్సవం ఆర్కే బీచ్ లో జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు.