వైభవంగా కృష్ణాష్టమి సంబరాలు.. అలరించిన ఉట్టి వేడుకలు - Krishnashtami celebrations in AP
రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణుని నామ స్మరణతో ప్రతీ ఊరు వాడ మార్మోగిపోయింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలక మండలి కృష్ణాష్టమిని కన్నుల పండువగా జరిపారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేసి ఉట్టి పండుగ నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లోని స్థానిక 62 వ డివిజన్ లో శ్రీ కృష్ణాష్టమి, గుడి- గోపూజ కార్యక్రమంలో సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొన్నారు. గుంటూరులోని మల్లారెడ్డి నగర్లో ఇస్కాన్ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలను కన్నులపండువగా నిర్వహించారు. యువకులు, మహిళలు, చిన్నారుల కేరింతల మధ్య.... ఉట్టికొట్టే కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదాన్ని, ఆధ్మాత్మికతను పంచిపెట్టింది.