GULAB EFFECT: గులాబ్ తుపాన్ బీభత్సం.. రాష్ట్రంలో పొంగిపొర్లిన వాగులు, వంకలు - గులాబ్ తుపాన్ బీభత్సం
గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనేక గ్రామాలు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలోనే ఉన్నాయి. వరద నీరు ఇళ్లల్లోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు.