చౌడువాడలో కన్నులపండువగా గౌరమ్మకు సారె ఊరేగింపు - చౌడువాడలో గౌరమ్మ ఉత్సవం
విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడలో గౌరమ్మకు సారె ఊరేగింపు కన్నులపండువగా జరిగింది. మహిళలు గౌరమ్మకు సారెతో పాటు... 108 రకాల సాంప్రదాయ పిండివంటలను ప్రసాదంగా సమర్పించారు. పిండివంటలు, ఎడ్లబళ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూజ అనంతరం భక్తులకు ప్రసాదం వితరణ చేశారు.