ఉభయ గోదావరి జిల్లాల్లో మంచు అందాలు - పశ్చిమ గోదావరి పొగమంచు న్యూస్
ప్రకృతి అందాలకు నెలవైన ఉభయ గోదావరి జిల్లాల్లో పొగమంచు అలముకొని... ప్రకృతి సోయగాన్ని మరింత పెంచింది. రహదారి మేర పొగమంచు కమ్ముకొని... పచ్చదనం మరింత మనోహరంగా కనువిందు చేసింది. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో పొలాల్లో పరుచుకున్న పొగమంచు చూపరులను ఆకట్టుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో కమ్ముకున్న పొగమంచు ఆహ్లాదకరంగా ఉంది.