ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

prathidhwani: అన్నదాతలకు ప్రభుత్వాలు భరోసా కల్పిస్తాయా? - ధాన్యం అమ్మకాలపై ప్రతిధ్వని చర్చా

By

Published : Nov 4, 2021, 10:15 PM IST

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఐకేపీ కేంద్రాలు, రైస్‌ మిల్లులు, మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. అకాల వర్షాల భయంతో రైతులు కాస్త ముందుగానే వరి కోతలు చేపట్టారు. దీంతో.. ఇప్పటికే భారీస్థాయిలో పంట కొనుగోలు కేంద్రాలకు చేరింది. ధాన్యం మోసుకొచ్చిన ట్రాక్టర్లు ఇప్పుడు మార్కెట్‌ యార్డుల వద్ద బారులు తీరుతున్నాయి. అయితే.. కొనుగోళ్ల లక్ష్యానికి ప్రభుత్వం పరిమితి విధించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ధాన్యం తరలింపు ఆలస్యమైతే పండించిన పంట అమ్ముకోలేమన్న భయం వారిలో తీవ్రమైంది. ఈ నేపథ్యంలో.. రైతులకు ప్రభుత్వాలు భరోసా కల్పిస్తాయా? కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఎలా జరుగుతోంది? రైతులకు కనీస మద్దతు ధర దక్కుతోందా? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details