Chalo Vijayawada: పీఆర్సీపై ఉద్యమించిన ఉద్యోగులు.. బెజవాడలో రోడ్లన్నీ జనసంద్రం
పీఆర్సీపై ఉద్యమించిన ఉద్యోగులు విజయవాడ తరలివచ్చారు. చలో విజయవాడకు రాకుండా అడుగడుగునా నిఘాపెట్టి నిర్బంధం చేసినా.. తమ కొత్త పీఆర్సీపై తమ ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని చాటారు. వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.