మాస్కే రక్ష.. అజాగ్రత్తే శిక్ష - ప్రకాశంలో కరోనాపై అవగాహన వార్తలు
కరోనా కాలం ఇది. ఏమాత్రం అజాగ్రత్తతో ఉన్న మూల్యం తప్పదు. అందుకే అనవసరంగా రోడ్ల పైకి రాకుండా ప్రజల్ని... పోలీసులు కట్టడి చేస్తున్నారు. అయిన ఏదొక సాకుతో ప్రజలు రోడ్డెక్కుత్తున్నారు. అటువంటి వారికి అవగహన కల్పించేందుకు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలో ఆర్డీటీ సంస్థ అధ్వర్యంలో వినూత్న ప్రయత్నం చేశారు. కరోనా వేషధారణతో.. కూరగాయల మార్కెట్లోని ప్రజలకు అవగాహన కల్పింస్తున్నారు. అంబేడ్కర్ సెంటర్లో తిరుగుతున్న వాహనదారులను ఆపి మరీ ముఖానికి మాస్కు ధరించేలా చేస్తున్నారు.
Last Updated : Apr 29, 2020, 11:22 PM IST