సర్వభూపాల వాహనంపై శ్రీవారి విహారం - తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు
శ్రీనివాసుని వార్షిక వసంతోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. వసంతోత్సవాల్లో భాగంగా సోమవారం సర్వభూపాల వాహనంపై.. శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆశీనులైనారు. అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయంలోని కల్యాణ మండపానికి వేంచేశారు. అక్కడ మంగళవాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఉత్సవమూర్తులకు వసంతోత్సవ అభిషేకాదులు, స్నపన తిరుమంజనంను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా కాణంగా భక్తులు లేకపోయినా నిరాడంబరంగా స్వామివారకి పూజలు నిర్వహించారు.