శ్రీవారి దర్శనానికి అనుకోని అతిథి - Thirumala latest news
తిరుమల శ్రీవారి దర్శనానికి అనుకొని అతిథి వచ్చింది. కనులకు ఇంపైన రూపాన్ని కలిగిన ఆ అతిథి భక్తులకు అమితానందాన్ని కలిగించింది. చూడ చక్కని రంగు, ఒంటి నిండా కన్నులతో... సృష్టిలో ఉన్న అద్భతమంతా తన రూపంలోనే దాచేసుకుంది. అంతటి సౌందర్యాన్ని ఆస్వాదించని మనిషి ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. తిరుమల శ్రీనివాసుని ప్రాంగణంలో ఈ అతిథి విహారిస్తూ కనిపించింది. వేంకటేశ్వర ఆలయంకు సమీపంలోని తిరుమాడవీధుల్లో అరుదైన సీతాకోకచిలుక భక్తులకు కనిపించింది. ఎంతో అందం, ఆకర్షణీయంగా ఉండటంతో యాత్రికులు ఆసక్తిగా తిలకించారు. దీని శాస్త్రీయనామం ఇండియన్ మాత్ లేదా ఇండియన్ లూనా మాత్ గా పిలుస్తారని అటవీ విభాగం అధికారులు తెలిపారు. అరుదుగా కనిపించే ఈ సీతాకోకచిలుకలు రాత్రి పూట సంచరిస్తాయని అన్నారు.