దుప్పిని చుట్టి ప్రాణం తీసిన కొండచిలువ - chandragiri latest news
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణిడ్యామ్ సమీపంలోని ఫిల్టర్ హౌస్ వద్ద కొండచిలువ దుప్పిని చుట్టుముట్టి ప్రాణం తీసింది. దాన్ని మింగేందుకు విఫలయత్నం చేసి, ఫలితం లేకపోవడంతో అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్న పశువుల కాపరులు ఈ దృశ్యాలను తమ చరవాణుల్లో చిత్రీకరించారు. గత కొంతకాలంగా అటవీ సమీప ప్రాంతాల్లో విష సర్పాలు, కొండచిలువలు సంచరిస్తున్నాయి. రెండు రోజుల క్రితం రామచంద్రాపురం మండలంలో కోళ్ళను మింగుతున్న కొండచిలువను గుర్తించిన స్థానికులు దాన్ని చంపేశారు. అటవీశాఖ అధికారులు స్పందించి ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.