Pratidhwani: అసలేమిటీ పంచాంగం.. ఎందుకంత ప్రాముఖ్యం ? - ETV Bharat Pratidhwani Debate on Ugadi Panchangam
సకల శుభాలకు ఆరంభం.. ఉగాది పర్వదినం! ఈ రోజు ప్రత్యేకం.. పంచాంగశ్రవణం ! ఏటా ఉగాది వస్తునే ఉంటుంది. ఇలాంటి పంచాంగ శ్రవణాలు చూస్తునే ఉంటాం. కాకపోతే... అసలు... ఏమిటీ ఈ పంచాంగం? అది ఎందుకంత ప్రత్యేకం? అది ఎప్పుడైనా ఆలోచించారా? రోజూ ప్రతిచిన్న పనికి క్యాలెండర్, పంచాంగం ముందు పెట్టుకుని... వర్జ్యం, దుర్ముహూర్తం, రాహు కాలం, యమగండ కాలం, అమృత ఘడియలు ఇలా ఒకటికి రెండుసార్లు ముహూర్తాలు చూసుకుంటూ ఉంటారు. అదే సమయంలో... అసలు జోతిష్యానికి ఉన్న శాస్త్ర ప్రమాణం ఏమిటి ? తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం చెప్పే సంగతులు ఏమిటి? ఈ కథ ఎప్పుడు, ఎలా మొదలైంది? ఆ అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST