Prathidwani: నదుల అనుసంధానం పథకం వల్ల నదుల సహజత్వం దెబ్బతింటుందా? - Connection of rivers
Prathidwani: దేశంలో ప్రవహించే జీవనదుల్లో జలసంపద తొణికిసలాడుతోంది. ఈ నీటి వనరులను దేశ సమగ్రాభివృద్ధికి వినియోగించే లక్ష్యంతో చేపట్టిన నదుల అనుసంధానం ప్రక్రియపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నదుల అనుసంధానంలో భాగంగా తెచ్చిన రివర్ బేసిన్ అథారిటీ, డ్యామ్ సేఫ్టీ అథారిటీ బిల్లులు రాష్ట్రాల హక్కులను తూట్లు పొడిచేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు నదీ జలాల వినియోగంపై ఇప్పటివరకూ కేంద్రం అనుసరిస్తున్న విధానం ఏంటి? నదుల అనుసంధానం ప్రక్రియలో రాష్ట్రాల పాత్ర ఎలా ఉంటుంది? రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఏంటి? నికర జలాలు, మిగులు జలాల పంపిణీ, వినియోగంలో ప్రాధాన్యాలు ఎలా ఉంటాయి? ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:16 PM IST