రాష్ట్రానికి కొత్త అప్పుల తిప్పలు.. ఆర్ధికావసరాల పరిస్థితి ఏంటీ..? - ప్రతిధ్వని
Andhra Pradesh debt burden: ఏపీకి అప్పులు ఇస్తున్నారా బహుపరాక్! అసలే కొంతకాలంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. రాష్ట్రప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ, రుణాల తీరును చర్చల్లో నలిగేలా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఏపీ ప్రభుత్వ కార్పొరేషన్‌లకు రుణాలు ఇవ్వడంలో ఆచితూచి వ్యవహరించాలని కేంద్ర ఆర్ధిక శాఖ జాతీయ బ్యాంకులకు చెప్పిందన్న మాట హాట్‌టాపిక్‌గా మారింది. ఆదాయానికి - అప్పులకు పొంతన లేకుండా సంక్షోభం చిక్కుకున్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఈ పరిణామం పెనుప్రభావం చూపే అవకాశం ఉంది. అసలు కేంద్ర ఆర్ధిక శాఖ ఈ దిశగా ఎందుకు దృష్టి సారించినట్లు..? ఇప్పుడు రాష్ట్ర ఆర్ధికావసరాల పరిస్థితి ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:12 PM IST