వీరసింహారెడ్డి జోరు.. బాలయ్య సినిమాకు ర్యాలీగా 150 కార్లు - ర్యాలీగా 150 కార్లు
Veerasimha Reddy Rally నందమూరి బాలకృష్ణ 107వ సినిమా వీరసింహారెడ్డి చూడడానికి తెలంగాణలోని నిజామాబాద్లో సుమారు 150 కార్లలో అభిమానులు తరలివెళ్లారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం నుండి అభిమానులు 150 కార్లలో 600 మంది జిల్లా కేంద్రానికి వెళ్లి సినిమాను తిలకించారు. బాలయ్యపై అభిమానంతో తాము ఇలా అందరం కలిసి వెళ్తున్నామని అభిమానులు తెలిపారు. వీరసింహారెడ్డి మూవీతో తమకు సంక్రాంతి ముందే వచ్చిందని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST