'కరవుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి, రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి'
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2023, 12:24 PM IST
Irrigation Water Problem In Nandyal : రాష్ట్రంలో ఉన్న కరవు పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. సాగు, తాగునీటి సమస్య తీవ్రతరం అయ్యే పరిస్థితుల్లో కరువు మండలాలను ప్రకటించాలని ఆయన కోరారు. దాదాపు 18 జిల్లాల్లో అతితక్కువ వర్షపాతం నమోదు కావడంతో చాలా చోట్ల పంటలన్నీ ఎండిపోయాయి. ఖరీఫ్ సీజన్లో సాగుచేయడానికి నీరు లేకపోవడంతో రైతులు ఎటువంటి పంటలు వేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలన్నారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో తుంగభద్రపై అప్పర్ భద్ర ప్రాజెక్టు, కృష్ణానది ప్రాజెక్టుల్లో.. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రామకృష్ణ ఆరోపించారు. రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. నంద్యాల సమీపంలో ఉన్న కేసీ కాలువను రామకృష్ణ పరిశీలించి ఆయకట్టు రైతులతో రామకృష్ణ మాట్లాడారు.