రాజధాని అమరావతిలో వింతైన చోరీ - కొద్ది కొద్దిగా కొల్లగొడుతున్నదొంగలు - అరావతిలో తాజా దొంగతనాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2023, 1:51 PM IST
Big Pipes Theft in Amaravati :రాజధాని ప్రాంతంలో దొంగలు రెచ్చిపోతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా బంగారం, డబ్బులు, వాహనాలు వగైరా దొంగతనం చేయడం చూసి ఉంటాం. కానీ అమరావతిలో ఓ కొత్త తరహా చోరీ జరిగింది. రాయపూడి-దొండపాడు సీడ్ యాక్సెస్ రహదారిలో ఉంచిన ఇనుప పైపులను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేస్తున్నారు. వీటిని గత ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. రాజధానిలో నిర్మించే రహదారి పక్కన వరద నీరు వెళ్లేందుకు ఈ పైపులను వినియోగించనున్నారు. గత కొంతకాలంగా వీటిని అధికారులు పట్టించుకోకపోవడంతో చోరీకి గురవుతున్నాయని అంటున్నారు స్థానికులు.
Huge Pipes Robbery in AP Rajadhani :భారీ సైజులో ఉండే ఈ పైపులను దొంగలు చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకెళ్తున్నారని రాజధాని రైతులు తెలిపారు. రాష్ట్రంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయని, ఘటనా స్థలానికి చేరుకుని పైపులను పరీశీలించామని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ పని చేసి ఉంటారని వారు అన్నారు.