ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Narendra_on_Inner_Ring_Road_Investigation_Office

ETV Bharat / videos

Dhulipalla Narendra on IRR Investigation Officer: ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు.. విచారణ అధికారిని ఎందుకు మార్చారు జగన్? : ధూళిపాళ్ల - టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 3:55 PM IST

Dhulipalla Narendra on Inner Ring Road Investigation Officer:అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసుకు సంబంధించిన దర్యాప్తు అధికారి ఏఎస్పీ జయరాజును మార్చడంపై.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర స్థాయిలో  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎస్పీ జయరాజు బదులుగా డీఎస్పీ విజయ్ భాస్కర్‌కు బాధ్యతలు అప్పగించడంపై ఆయన జగన్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. చట్టానికి విరుద్ధంగా పని చేసే ఏ అధికారినైనా భవిష్యత్తులో వదిలిపెట్టమని హెచ్చరించారు.

Dhulipalla Narendra Comments: ''ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణ అధికారి జయరాజును అకస్మాత్తుగా ఎందుకు మార్చారో..? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. విచారణాధికారిని మార్చడం వెనుక కచ్చితంగా ఏదో కుట్ర ఉంది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు చూస్తున్న విచారణ అధికారిని రాత్రికి రాత్రే ఎందుకు మార్చారు..? జయరాజును అకస్మాత్తుగా బదిలీ చేసి ఆ స్థానంలో డీఎస్పీ విజయ్ భాస్కర్‌కు ఎందుకు బాధ్యతలు అప్పగించారు..?, కేసు విచారణ కీలక దశలో ఉన్నప్పుడు దర్యాప్తు అధికారిని ఎలా మారుస్తారు..?, చట్టానికి విరుద్ధంగా పని చేసే ఏ అధికారినైనా భవిష్యత్తులో వదలిపెట్టం. తప్పుడు పనులు చేసే అధికారులపై విచారణ చేస్తాం. కఠినంగా చర్యలు తీసుకుంటాం. డీఎస్పీ స్థాయి అధికారి విజయ్‌ భాస్కర్‌తో కేసును మీరు అనుకున్నట్టు నడిపిద్దామని అనుకుంటున్నారా..?. అరెస్ట్‌ చేసిన తర్వాత ఆధారాలు సేకరిస్తామని దర్యాప్తు సంస్థలు చెప్పడం విడ్డూరంగా ఉంది.'' అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.

ABOUT THE AUTHOR

...view details